ఏ గ్రంథమైననూ సాంతముగా చూచి ఆకళింపు చేసికొనిన సుస్వభావులు కా గ్రంథమందు చెడ్డ విషయ మొక్కటినూ కానరాదు. గాన ప్రతీ గ్రంథమునూ ప్రతి వారికీనీ సంతోషము నొసగును. పంట కాలువల నుండి ప్రవహించిన తియ్యని నీటిచే మొలచి ఏపుగా పెరుగుచున్న సస్యము సముద్ర జల ప్రవాహమునెట్లు భరింపలేదో అట్లే అల్పజ్ఞునిచే చేయబడిన గ్రంథము న్యాయ దృష్టి లేని కుశాగ్రబుద్ధులగు పండితుల విమర్శలకు విలువలేదు.