దుఃఖంతో ధైర్యం నశిస్తుంది. దుఃఖం మంచిచెడులను ఆలోచించనీయదు. దుఃఖం వల్ల సర్వాన్నీ కోల్పోతాం. దుఃఖంలాంటి శత్రువు లోకంలో లేడుగాక లేడంటారు పెద్దలు. అలాంటి శత్రువుని ఎదుర్కొనేటట్టు చేయడం, నవ్వించడం సరసిగారు బాధ్యతగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను ఒకరు వేలెత్తి చూపించకుండా నిర్వర్తిస్తున్నారు. ఎక్కువగా మాట్లాడటం ఎవరికీ యోగ్యం కాదు. అలాగే కార్టూన్ కూడా ఎక్కువగా మాట్లాడకూడదంటారు పెద్దలు.