మిథునం ఒక జీవితం. బంగారు మురుగు ఒక సాంప్రదాయం. ధనలక్ష్మి ఒక విజయగాథ. సక్సెస్ అంటే డబ్బు గడించడమే కాదు సంసారం గాడి తప్పకుండా చూసుకోవడం కూడా అనే సందేశాన్నిచ్చింది ధనలక్ష్మి. ఇలా పేరుపేరునా, ప్రతికథనీ ఆకాశానికెత్తడం నా అభిమతం కాదు. అయినా చెప్పక తప్పదు, "తేనెలో చీమ" లో కూడా తేనేవుందన్నారు. తినబోతూ రుచేల? ఈ సంపుటిలో కథలు గొప్పవి కాకపోవచ్చు గాని, లక్షణంగా చదివించేస్తాయి. అందరు ఇప్పటిదాకా పడిన ఎడిషన్లే సాక్ష్యం. మిథునం కథా సంపుటిని కుటుంబ సభ్యులందరికీ తలా ఒక కాపీ ఉండాలి. ఎందుకంటే ఎవరి టేస్టు వారిది!