ఈ సంపుటిలోని కధల్లో గల ప్రత్యేకత అన్నీ 700 పదాల లోపు, అంటే దాదాపు రెండు పేజీలు మించకపోవడం, ప్రతీ కధా అనూహ్యమైన మలుపుతో పూర్తవడం. ప్రతీ కధా ఇతివృత్తం కూడా క్రైమ్ కీ సంబంధించింది అవడం వల్ల ఆ తరహా కధలని ఇష్టపడే పాటకులకి ఇవ్వన్నీ నచ్చుతాయి. మొదటిసారి ఇలాంటి కధలని చదివే పాటకులు ఈ తరహా చిన్న క్రైమ్ కధలతో ప్రేమలో పడటం ఖాయం. ప్లేబాయ్, న్యుయార్కర్, ఎల్లరీ క్వీన్స్ మిస్టరీ మేగజైన్ లాంటి ప్రసిద్ధి పత్రికల్లో అచ్చయిన ఇవన్నీ నాణ్యత గల మంచి కధలే. చక్కటి శైలితో సుళువుగా చదివించేలా రాయబడ్డ ఇవన్నీ మల్లాది వెంకటకృష్ణమూర్తి కలం నించి వెలువడ్డాయి.