PublisherWestland AuthorVasundendra ISBNWEST0001 LanguageTelugu BindingPaperblack Publication Year2018 No. of Pages246
Description
మోహనస్వామి తన దీర్ఘకాల సహచరుడు కార్తీక్ ను పోగొట్టుకున్నాడు; అందమైన ఒక ఆడది అతడిని లాక్కున్నది. తన బాల్యం, జీవితపు ఎంపికలు, నిరాశా క్షణాలు, సంపాదించుకున్న, పోగొట్టుకున్న ప్రేమికులు, మిత్రులు - అన్ని జ్ఞాపకాలూ చితిలా అతడిని కాల్చుతున్నాయి. అలాగని అతడి కోరికలు గొప్పవేమి కావు. ఒకింత ప్రశాంతమైన, గౌరవనీయమైన సాధారణ జీవితం కోసం అల్లాడుతున్నాడు. గత జీవితపు గాయాలు, అవమానం, భయం, ఆటంకం మరియు నిరాశ - అన్నిటినీ మరిచిపోయేటంతటి కొత్త జీవితం కోసం తపిస్తున్నాడు. 'ఆడంగి వెధవ', 'ఆడపులి' - ఇలా ఎన్నెన్నో పాడు ఉపనామాలతో ఈ సమాజం అతడికి చేసిన గాయాలు మాసిపోవలసి ఉంది. 'గే' జీవితపు చీకటి కోశం నుంచి స్వయంగా రచయితే బయటికి రావడానికి కనుక్కున్న చివరిదారిగా ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. పురుషుల - పురుషుల నడుమ ప్రేమకు, కామానికి సంబంధించిన కథలను జీర్ణించుకోలేని సంప్రదాయపరులైన పాఠకులు ఉలిక్కిపడ్డారు. స్వేచ్చాయుతమైన శైలితో చిత్రించే మోహనస్వామి కథల్లో లైంగికత, నగరీకరణ మరియు వర్గ సంఘర్షణలు దహించివేసే నిజాయితితో రూపొందాయి. పాఠకులను ఒకింతసేపు కలవరపరుస్తాయి. ఇంగ్లీష్, మలయాళం, స్పానిష్ భాషల్లో ప్రచురింపబడిన ఈ పుస్తకం తెలుగు ప్రచురణ ద్వారా కన్నడ సాహిత్యంలోని అత్యంత ముఖ్యమైన ఒక ధ్వనిని పాఠకులకు మేము పరిచయం చేస్తున్నాం.