ఏదైనా ఒక పనిని మంచికాలంలో ప్రారంభించమంటారు. అదే సుముహూర్తకాలం. నవగ్రహముల యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఎంతగానో ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే కొన్ని నక్షత్రాలు, తిధులు, వారాలు కలిసున్నప్పుడు కొన్ని యోగాలు కలుగుతాయని పెద్దలు, పండితులు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.