కవిత్వానికి, కవిలో బీజప్రాయంగా అంకురించిన మొలక చివురులు ప్రధానం. అలా మొలక వేసిన భావనలను తన ప్రకటనా పటిమతో, శ్రోతకో, పాఠకునికో చేర్చగలిగితే, ఆ కవితకు నిలకడ దొరికినట్లే, ఆ కవికి కవయిత్రికి ఉనికి ఏర్పడినట్లే. అలా తన కవితలకు పదినాళ్ళ ఆయునిచ్చి, తన ఉనికిని చాటుకున్న కవయిత్రి విజయలక్ష్మి పండిట్.