Naa Chinnanati Mucchatlu By Dr.K N Kesari

Be the First to Review
200
Only 1 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherRaja Chandra Foundation ISBNVPHTO0127 AuthorDr.K N Kesari LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages220
Description

                                         నా తల్లికి నేనొక్కడనే సంతానము. ఆమె తనకు ఆడబిడ్డలు లేని ముచ్చట తీర్చుకొనుటకై నాకు ఆడపిల్ల వేషము వేసి ఇరుగు పొరుగిండ్ల చూపి ఆనందించుట నాకిప్పటికిని జ్ఞాపకమున్నది. నా 5వ ఏటనే మా అమ్మ నన్ను మా ఊరిలో బడికి చదువ పంపినది. ఆ బడిపంతులు పేరు పిచ్చయ్య గారు. వారికి పిల్లకాయలకు చదువు చెప్పగల సామర్థ్యము లేకపోయినను చీటికి మాటికి వారిని చావగొట్టేవారు. అందుచేత వారిని చుస్తే పిల్లకాయలందరికి చాలా భయముగా ఉండేది. ఆ కాలములో బడిపంతుళ్లకు నెలజీతములు లేక నెలకింతని జీతముగనిచ్చుట లేకపోయినను భోజన పదార్థములగు వరిగలను, కాయధాన్యములను, వంకాయ, గోంగూర, పచ్చి మిరపకాయలు మొదలగు కాయగూరలను, రైతుల పిల్లకాయలు తెచ్చి ఇచ్చేవారు. అందుచే వారు పంతులు దయకు పాత్రులై యుండేవారు. అట్టివారికి దెబ్బలుండవు. ఏమీ తేలేని వారికి మాత్రమూ, పంతులు బెత్తముతో కావలసినన్ని పేము పండ్లను ప్రసాదించేవారు. బడిలో పిల్లకాయల సంఖ్యను బట్టి ప్రభుత్వము వారు అప్పటికి కొంత కాలము నుండి, సాలీనా రొఖ రూపమున గ్రాంటు నిచ్చుచుండిరి. ఆ సర్కారు గ్రాంటుకై ఆయన తంటాలు పడి పిల్లకాయలను బడికి చేరదీసేవారు. 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",