ఐఏఎస్ అధికారి మొదలు, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ వరకూ, ఆపైన పద్నాలుగో ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా వరకూ సాగిన నా ఉద్యోగ ప్రస్థానంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నానంటే అది నా ఒక్కడి ప్రతిభే అని చెప్పలేను. ఎంతోమంది సహోద్యోగుల సమష్టి కృషి వాటిలో దాగి ఉంది. తమ పరిజ్ఞానం, చర్చల ద్వారా కొత్త కోణాల్లో ఆలోచనను సాగిస్తారు, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దిశానిర్దేశం చేస్తారు.