ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రచనలకు అదనంగా ఇవ్వాళ అత్యవసరమైన మరింత సమాచారాన్ని ఈ పుస్తకం అందిస్తుంది. ఆంధ్రరాష్ట్రం భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తోలి రాష్ట్రం. 1953 అక్టోబర్ 1 న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తరువాత మరెన్నో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం భాషను ప్రజల ఐక్యతకు ప్రాథమికమైన ఆధారంగా చూడడమే దీనికి కారణం. అయితే స్థానికమైన రాజకీయ సాంస్కృతిక ఆకాంక్షలను, సామజిక ఆర్థిక అవసరాలను తీర్చడంలో విఫలమైనప్పుడు అదే ఒక విభాజికశక్తిగా రూపొందింది.