అనేక రంగాలలో నేడు స్త్రీ పాల్గొంటూన్నది. చాలా ప్రగతిని సాధించామనుకొంటూన్న ఈ రోజులలో కూడా స్త్రీలు సంఘంలో తరతమ బేధాలు లేకుండా అందరూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు యువతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక ప్రగతి ఎక్కడ? స్త్రీ స్వాతంత్య్రం కావాలి అనే నినాదాలను నిరశిస్తూ నిజమైన స్వాతంత్య్రాన్ని ఎలా పొందాలో చెప్పి, నీరసమైన ఈ నినాదాల కంటె నిజమైన సేవల అవసరం ఎక్కడో తెలియజెప్తూ, కొన్ని హద్దులను దాటినపుడు స్త్రీకి తన ప్రత్యేకతలూ, అందాలు కూడా నెమలికనుల చందమవ్వగలవని నిరూపించిన నవల. నేటి సమాజంలోని తిరుగుబాటులకూ, అన్యాయాలకూ అద్దం పట్టిన నవల.