PublisherAnalpa Book Company ISBNABC0006 AuthorVadrevu Chinaveerabhadrudu LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages234
Description
తెలుగులో యాత్రా చరిత్రలు కొత్త కాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర నుండి ఆదినారాయణ భ్రమణకాంక్ష దాకా రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారి నుంచి బి. వి. రమణ ట్రెక్కింగ్ అనుభవాలదాకా తెలుగు సాహిత్య ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే వాడ్రేవు చినవీరభద్రుడు రాస్తూ వచ్చిన యాత్రారచనల సంకలనం ఇది.ఇందులో 1997 లో ఇంగ్లాండ్ సందర్శించినపుడు రాసిన యత్రానుభవాలతో పాటు ఇండియాటుడే తెలుగు పత్రిక కోసం అరకులోయ, నల్లమల దారులు, పాపి కొండల నడుమ సంచరించిన యాత్రాకథనాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక స్థలాలయిన అరుణాచలం, బృందావనం, త్రయంబకంలతో పాటు, జైన బౌద్ధ క్షేత్రాలయిన శ్రావణ బెళగొళ, సాంచిల సందర్శనానుభవాలూ, ఆదిమమానవుడి గుహా చిత్రాలతో పాటు అద్భుతమైన శిల్ప రామణీయకత వెల్లివిరిసే హళేబీడు, బేలూరుల దాకా ఎన్నో రాసిన ఉత్తరాలతో పాటు కాశీ యాత్ర అనుభవాల కథనం ఈ సంపుటిలో ప్రత్యేక ఆకర్షణ.