PublisherSri Shanmukheswari Publications AuthorG V Purnachand ISBNSMLATA0001 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages148
Description
ప్రేమ స్వాతంత్ర్య సంఘం (ఫ్రీ లవ్ సొసైటీ) అనే సంస్థ ఒకటి స్వత్నత్ర్యోద్యమం తొలినాళ్లలో బాగా విస్తృతంగా పనిచేసేదిని చెప్తారు.
పెళ్ళిళ్ళు కడుపులు వ్యభిచారాల్లాంటి జంజాటాలకు అతీతమైన ప్రేమని ఈ సంస్థ ప్రభోదించేది. అదొక ప్రేమ ప్రపంచం. వ్యక్తిగతమైన స్త్రీ పురుష బంధాల్ని కట్టుబాట్ల చట్రంలో బిగించటాన్ని ఈ ఉద్యమం వ్యతిరేకించేది. పరిణతి పొందిన స్త్రీ పురుషుల ఆద్య భవోద్వేగాల పరమైన సంబంధాల్ని లైంగిక పరమైన సంబంధాల్ని గౌరవనీయమైనవిగానే ఈ సంస్థ పరిగణిస్తుంది. చర్చి అధిపత్యానికి వ్యతిరేకంగా ఇంగ్లండు కార్యస్థానంగా ప్రారంభమైన ప్రేమస్వమ్య ఉద్యమం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర మాట దేశాలకు ఇది విస్తరించింది.
ప్రేమించావాల్సిందిగా వేదించే యాసిడ్ ప్రేమికుడికి సెక్స్ కోసం భార్యని వేదించే భర్తకి మధ్య మనస్తత్వ పరంగా ఎలాంటి తేడా లేదని వివాహ వ్యవస్థ అనేది రేప్ చేసే హక్కులిచ్చేది కాదని 'ఫ్రీ లవ్ ఉద్యమం' వాదిస్తుంది. ప్రేమ లేని పెళ్ళిళ్ళు రేప్ చేయటం కన్నా ప్రమాదకరమైనవే!