డా. విలియం దర్తో ఏర్పడిన పరిచయంతో వారి రచనల పట్ల ఇష్టం ఏర్పడింది. వాటిని చదువుతూ వారి కృషి అంకిత భావం, ప్రపంచ మానవాళికి ఆయన అందిస్తున్న సేవలను గమనించి, ఆరాధన భావం ఏర్పరచుకున్నారు. వివిధ సందర్భాల్లో వారితో ముఖాముఖీ మాట్లాడారు. ఇక్రిశాట్ని చూసి తన్మయులయ్యారు. ప్రొఫెసర్ అరుణ తివారీగారి ప్రోత్సాహంతో వివిధ గ్రంథాలనుండి, ఇక్రిశాట్ వెలువరించిన వివిధ సంపుటిల నుండి సేకరించిన సమాచారంతో డా. విలియం దర్ స్వయంగా అందజేసిన విశేషాలతో అతని జీవిత చరిత్రను, పరిశోధన ఫలితాలను గ్రంథస్తం చేసి మీముందుకు తీసుకువచ్చారు. చదివి ఆనందించండి.