”ఎన్టీఆర్తో నేను” అనే పేరు పెట్టి శ్రీ దొర వ్రాసిన ఈ పుస్తకం రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన దశాబ్దం, ఎనభైలలో జరిగిన విశేష పరిణామాలను అక్షరబద్ధం చేస్తున్నది. దేశ చరిత్ర వ్రాసేవారూ, జీవిత చరిత్రలు వ్రాసేవారూ ఇరవయ్యవ శతాబ్దిలోని ఎనిమిదవ దశకాన్ని గురించీ, రామారావు గారిని గురించీ యథార్థ సంఘటనల సమాచార సమాహారాన్ని అందించవచ్చు. కానీ, ఆ సంఘటనల వెనుక నడిచిన కథలను వెల్లడించే అవకాశాలు తక్కువ. అలాంటి సమాచారం పూర్తిగా కాకపోవచ్చు కానీ చాలావరకు ఈ గ్రంథం అందిస్తున్నది.