ఇతివృత్తమంటే కథే. ఇతి అంటే యిది. వృత్తమంటే చుట్టూ. ఇతివృత్తమంటే దీని చుట్టూ జరిగిన విషయం. అంటే "యిదీ కథ" అని నిర్వచించాల్సి వుంటుంది. ఆధునిక కాలంలో గ్రంథం, నవల, కథానిక, నాటకాల్లోని విషయాన్ని ప్రకటించాల్సి వచ్చినప్పుడు దాన్ని 'ఇతివృత్తం' గానే పరిగణిస్తున్నారు. ఆయా గ్రంథాల్లోని ప్రధాన కథే యితివృత్తం. పెద్దల నిర్వచనం ప్రకారం ప్రధాన కథ ఆఖ్యానము, దాని చుట్టూ వున్న యితర చిన్న సంఘటనలు వుపాఖ్యానాలు. అందువల్ల యితివృత్తమంటే వొక గ్రంథంలోని ప్రధాన కథకు సంబందించిన విషయం.