ఈ పేరు వినగానే ఇదేదో విశ్వానికి సంబంధించిన సైన్సు పుస్తకం అనుకునే వీలుంది. కానీ ఇవి విశ్వసాహితీ రచయితల గురించిన వ్యాసాలు.నోబెల్ సాహితీ బహుమతి పొందిన వాళ్ళ గురించి సాహితీ బహుమతి ప్రకటించిన వేంటనే ప్రపంచం కన్నా ముందే మన తెలుగు పాఠకుల చేత చదివించిన ఘనత ఈ వ్యాసాలది.