జీవితం ఒక కావ్యం అందులోని నాయికా నాయకులూ భార్యాభర్తలు. వారి పాత్రలను సక్రమంగా పోషించుకుంటే జీవితం రక్తి కడుతుంది. లేకుంటే రసాభాస అవుతుంది.
పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలూ....
పెళ్ళి చెయ్యబోయే అమ్మ - నాన్నలు....
పెళ్ళి ని అర్థం చేసుకోవాలనుకునే అందరు
చదవాల్సిన పుస్తకం పెళ్ళాడే బొమ్మా .
1961 - 62 సంవత్సరాలలో అలనాటి ప్రఖ్యాత కృష్ణాపత్రిక లో ధారావాహికంగా వచ్చిన పెళ్ళాడే బొమ్మా ఈ రోజు ఈ తరం కోసం రాసినట్లు ఉందని చదవగానే అనుకునేలా ఉన్న ఉషశ్రీ లేఖలు.