పిల్లల గురించి వాళ్ళని అర్థంచేసుకోవడం గురించి వాళ్ళకి చదువు చెప్పడం గురించి మాట్లాడని తత్త్వవేత్త లేడు. చెయ్యని ప్రయోగం లేదు. జరగని చర్చ లేదు. పాడనీ ఆందోళన లేదు. అయినా అందరం గజఈతగాళ్ళమే గని గజం కూడా ఈద లేదన్నట్టే ఉంది మన పరిస్థితి.
ఆధునిక సమాజం ఈ విషయంలో మరి వికారంగా వుంది. తల్లిదండ్రులు ఆకాంక్షతో వ్యాపారుల ధన దాహం విద్యాశాఖ చేతగానితనం ఉపాధ్యాయుల గతానుగతికత్వం కలిపి పిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాయి. రాను రాను గతంలోని ప్రజాస్వామ్యం కూడా సన్నగిల్లుతోంది. మన చదువులు ఒక సుడిగుండంలో ఇరుక్కుపోయాయి. దీంట్లో మన పిల్లలు విలవిలలాడుతున్నారు. దీని ప్రభావం భవిష్యత్ సమాజం మీద ఏ రూపంలో ఎంత ఉంటుందనేది ఇప్పుడెవ్వరు కొలిచి చెప్పగలవారు లేరు. కొద్దిగా అంచనా వేసి చెప్పగల వాళ్ళున్నా వినేవారు లేరు.