మన దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ మరింత పురోభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మన దేశం, మన రాష్ట్రం ప్రముఖ స్థానంలో నిలిచి, ప్రజానిక ఆర్ధిక అభ్యున్నతికీ దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పౌల్ట్రీ పెంపకం దార్లు తక్కువ ఖర్చుతో, ఎక్కువ దిగుబడి ఆశించడానికి, శాస్త్రీయపరమైన వ్యాధుల్ని ముందే జీవనియంత్రణ పద్ధతుల్ని ఆచరిస్తూ నివారించుకోవడ, బర్డ్ ప్లూ, గంబోరోలాంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని ముందే జీవనియంత్రణ పద్ధతుల్ని ఆచరిస్తూ నివారించుకోవడం, ఆధునిక పరికరాలు వాడుతూ సమయం, శ్రమ, కూలీలపై వ్యయం తగ్గించుకోవడం మొదలైన విషయాల్లో శ్రద్ధ చూపించాలి. బ్రాయిలర్ లేయర్ కోళ్ళ పెంపక విధానాలు, ఆహరం, వ్యాధులు - నివారణ, ఆధునిక యంత్రాలు, సిస్టంలు, మేలైన యాజమాన్య పద్ధతులు మొదలైన అంశాలపై డా.సి.హెచ్.రమేశ్ వ్రాసిన ఈ పుస్తకం పౌల్ట్రీ పెంపకందార్లకు, ఔత్సాహికులకు శాస్త్రీయపరమైన అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాము.