ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేసే విద్యార్థులకు ఒక పాఠ్యగ్రంథంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దీని ప్రణాళిక, నిర్మాణం విశిష్టమైనవి. భారతదేశంలో ఇటువంటి ప్రయత్నానికిదే ఆరంభం. భారతదేశపు గతచరిత్రను సరళమైన కథనశైలిలో బహుముఖంగా, విపులంగా వివరిస్తుందీ గ్రంథం. గ్రంథ నిర్మాణంలో అనుసరించిన బోధనాత్మక విషయాలు చరిత్ర అధ్యయనాన్ని ఒక ఆలోచనలు రేకెత్తించే పక్రియగానూ, ఆనందానుభూతిని కలిగించేదిగానూ తీర్చిదిద్దాయి. ఈ పుస్తకాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకోవడంలో మీకు తోడ్పడడం కోసం ఈ గ్రంథంలోని వివిధాంశాలను పరిశీలించడానికి విభాగం ఒక గవాక్షాన్నందిస్తున్నది.