సరళమైన ప్రేమించే కళ గురించి ఎవరూ బోధించలేదు. అందుకే పరిస్థితి ఇలా తయారైంది. అబ్బాయి అమ్మాయిని తాకలేడు. అందుకే చిన్న రాయిని విసురుతాడు. ఎందుకంటే, కనీసం తాను తాకిన రాయైనా ఆమెను తాకుతుందని. ఎందుకంటే, దగ్గరగా ఉండటాన్ని మీరు అంగీకరించలేదు. అందుకే అతను ఆమెను దూరం నుంచే తాకుతున్నాడు. మనిషి మనసును అర్థం చేసుకోనివారికి అది అంత స్పష్టంగా కనిపించదు. ఈ దేశంలో తమ భర్త చితి మంటల్లోకి దూకి వేల మంది స్త్రీలు సజీవదహనమయ్యారు. అది భర్త ఆధిపత్యపు భావనను సూచిస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే, తాను జీవించి ఉన్నప్పుడు ఆమె తన ఆధీనంలో ఉండాలనుకోవడం మాత్రమే కాదు, తాను చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో అని భయం. అది స్త్రీలకూ మాత్రమే వర్తించడం మీరు చూడొచ్చు. గడిచిన పదివేల సంవత్సరాలలో స్త్రీ చితిమంటల్లోకి ఒక్క పురుషుడు కూడా దూకలేదు.