ఒక కాలంలో కన్నడ సాహితీ సమ్మేళనాలలో కావ్యవాచనం తప్పనిసరి ఉంటుండేది. ఇప్పుడది ఎందుకో కనబడకుండా ఉంది. ప్రాచీన కావ్యాల్ని గమకం మూలంగా విన్పించుకునేది ఇప్పుడు మనలోని జ్ఞానంకు కష్టం కూడా! అయినా చదివితే కనబడని కావ్యంలోని అర్థాల పరదాలు మరొకరి గానం నుంచి మెరుస్తవి. అలాగున కొత్త అర్థాల్ని మెరిసినట్లుగా పాడుతున్నోళ్ళోలో జోళదరాశిగ్రామానికి చెందిన దొడ్డనగౌడ గారూ ఒకరుకదా! అర్థశతాబ్దానికి ఎక్కువకాలంగా వారు వందలాది సమ్మేళనాలలో సాహిత్యోత్సవాలలో జాతరలలో కావ్యగానం మరియు ప్రవచనాల్ని చేసియున్నారు.వీటన్నిట్లోనూ 1936 లో హంపిలో ఏర్పాటు చేసిన విజయ నగర సామ్రాజ్య స్థాపనలోని 600ల సంవత్సరంలో జరిగిన కార్యక్రమంలో ఉచ్చకంఠం నుంచి హరిహరగారి రచనను పాడి సభలోని చప్పుడును అణిగించిన ప్రసంగం ప్రఖ్యాతి పొందింది. తరీకెరెలో జరిగిన ప్రథమ జానపద సాహిత్య సమ్మేళనంలో తమ కావ్యవాచనను విన్పించుగోకనే చప్పుడు చేస్తున్న శ్రోతలేదురు చేతిలో ఉన్న గ్రంథాన్ని విసిరి వాళ్ళను రాపరాఫాకొట్టిన ప్రసంగమూ అంటే గొప్పగా ప్రఖ్యాతి పొందింది. సుప్రసిద్ధ రంగస్థల నటుడిగానూ అయిన గౌడగారి అభినయ ప్రతిభ, మా కాలంలోని ఎంతో మంది సాహితీలకు చూసేందుకు సాధ్యపడలేదు. అయితే వారి గానంలోని ప్రతిభను వారి జీవితంలోని అవసానదశలో వెళ్లి అనుభవించే అవకాశం నాకు ఒదిగి వచ్చింది.