ఒక అధికారిగా ఆయనలో ఉట్టిపడే సానుకూలతా దృక్పథాన్ని, పనిరాక్షసత్వాన్ని నేను అనేక సందర్భాల్లో దగ్గరనంది చూడటం జరిగింది. చాలామంది అధికారులు ఎవరికి సహాయం చేసినా, దానికి గుర్తింపు కోరుకునేవాళ్ళే. సహాయం చేయలేకపోతే చేయలేమని చెప్పకుండా పదేపదే తిప్పుకునేవాళ్ళు కొంతమంది. నాకు తెలుసి ప్రసాద్ గారు తనను కలిసి సహాయం కోరిన ప్రతివాళ్ళకీ సహాయం చేశారని చెప్పలేను. కాని ఆయన సహాయం చేయలేకపోయినా ఆయన మాట్లాడే తీరు మనసుకి ఏమాత్రం కష్టం కలిగించదు. పని కాలేదన్న అసంతృప్తినీ మిగల్చదు.