ఇంగ్లీషు, భాషా శాస్త్రంతోపాటు విభిన్నమత గ్రంథాలమీద పరిశోధన డా.వెన్నెలకంటి ప్రకాశంగారి ప్రత్యేకత. భగవద్గీతనుతెలుగులో గీతాగానం పేరుతో పాటరూపంలో రాశారు. దానిని దూరదర్శన్ వాళ్లు చిత్రీకరించారు.శ్రీమతి వెన్నెలకంటి రాజ్యలక్ష్మి (1950) ఆమంచర్ల నటరాజన్గారి అమ్మాయి. ఆమె విద్య రేవూరులోను,ఇందుకూరుపేటలోను, నెల్లూరులోను జరిగింది. వీరిద్దరి వివాహం 1965లో జరిగింది. అప్పటినుంచి విభిన్న గ్రంథాలనుకలిసి చదువుకున్నారు. డా. పుల్లెల శ్రీరామచంద్రుడిగారి వాల్మీకిరామాయణ అనువాదాన్ని చదువుకొని సారాంశంతయారు చేసుకొన్నదే ఇప్పుడు ఈ రూపం ధరించింది.