కమలా! నా ముంగిట్లో తీర్చిన ముత్యాలముగ్గువే నువ్వు!’’ అని మురిసిపోయాడు రంగయ్య.‘‘కసవుతో నిండింది దేశం. దాన్ని ఊడ్చాలి. కళ్లాపి జల్లాలి...’’ అని అడవులు వట్టింది కమల.తాను పెంచిన బిడ్డ పితూరీదార్లలో చేరిపోవడం క్షమించలేకపోయినా, తిరిగి ఆమె బిడ్డని పెంచడానికి తెచ్చుకున్న నికార్సయిన మనిషి రంగయ్య జీవితేతిహాసం ‘రంగవల్లి’.గ్రామస్థుల ముద్దుముచ్చట్లు, పంతాలు పట్టుదలలు కౌటిల్యాలు క్రౌర్యాలు, ఆశలు నిరాశలు, దయాదాక్షిణ్యాలు అద్వితీయంగా చిత్రించే నవల.