"మిథునం" కథాసంపుటి తరువాత 'ప్రిజం' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీరమణ గారి మరో పుస్తకం ఈ "రంగులరాట్నం". రంగులరాట్నం శీర్షిక వచ్చిన పుష్కరం తరువాత బాపుబొమ్మలతో పుస్తకంగా వచ్చింది. కాలం చెల్లిన ఖండికలను, వెలిసిపోయాయనిపించిన వాటిని వడపోసి సగానికి సగం తగ్గించి సంపుటిగా తెచ్చారు. 1990 మొదటి ముద్రణ నుంచి త్వరత్వరగా ఎడిషన్లు వచ్చాయి. ఇప్పుడు వ్యవధి తరువాత ప్రిజం సమస్త ద్వారా ఈ ఎడిషన్ మీ ముందుకు వస్తోంది.