కొందరికి పుట్టుకతోనే ఏదో విషయం పట్ల గాఢమైన ఆసక్తి ఉన్నట్లు తోస్తుంది. మరికొందరికి జీవితారంభంలో ఆ లక్షణం ఏర్పడి ఒక బలమైన ప్రేరణగా మారి వారిని చివరివరకు అదే మార్గంలో ముందుకు నడిపిస్తుంది. ఆ లక్ష్యానికి, దానిని ముందుకు తీసుకుపోయే వారికి మధ్య ఒకోసారి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. జయాలు, అపజయాలు కూడా ఆ క్రమంలో మైలు రాళ్లవుతాయి. ఆ విధంగా సాగిన ఒక ఉద్యమశీలికి అభివందనగా, తన మహత్తర లక్ష్యపు పునరుద్ఘాటనగా ఈ రచనను పేర్కొనవచ్చు.