జ్యోతిష్యశాంతులనే సాముద్రికశాస్త్రం కూడా ఆధారంగా చేసుకొన్నది. జ్యోతిష్యంలో కూడా భారతీయులకే శాంతులు ప్రవచించబడ్డాయి గాని అన్యులకు కాదు. కాని జ్యోతిష్య, జ్యోతిష్య ఆధారిత సాముద్రికాదిశాస్త్రాలు కేవలం ఒక దేశానికో, ఒక మతానికో సంబంధించినవి కాకుండా విశ్వజననీమైనవి. అలాంటప్పుడు అన్యదేశస్థులు, మతస్థులు భారతీయ భాషలకో, పరిస్థితులకో, ఆచార్యవ్యవహారాలకో, సామాజిక పరిస్థితులకో, వ్యవస్థలకో లోబడి ఉండలేరు కదా! అంతేకాక భారతీయులకైన, అన్యులకైన పారివారిక, ఆర్ధిక, హార్థిక, దైహిక, దైవిక, మానసిక, భౌగోళికాలు ఏవైనా ఏకరూపంగా ఉండలేవు కదా! అట్టి పరిస్థితులలో అనేకత్వంలో ఏకత్వం సాధించేందుకు పై కారణాలేవీ అడ్డు రాకుండా ఆయా వ్యక్తులు ఐచ్చికంగానే తమతమ మతానుగుణంగా, దేశానుగునంగా, విశ్వాసాలకనుగుణంగా వ్యవస్థలాధారంగా చెప్పబడిన శాంతులు చేసుకుంటే చాలు.