కడుపులోకి అన్నంతింటే శరీరమంతా శక్తి ప్రసరిస్తుంది. మీ ఊరికంతటికీ కావలసిన విద్యుత్తు- ఒక చోట విద్యుత్ గృహం ఉంటుంది ఈ ఊరికి చివరలో, పవర్ హౌస్ అంటుంటారు. అక్కడ నుంచి శక్తి ప్రసారమవుతుంది. అన్నిచోట్లకీ విద్యుత్తు వస్తోంది. అలాగే మనుష్య శరీరంలో కడుపులోకి తీసుకున్న అన్నం పచనమై, జీర్ణమై అందులో నుండి ఉద్భవించిన శక్తి శరీరానికంతటికీ అందుతోందా అందట్లేదా, అలాగే భరతవర్షే, భరతఖండే, జంబూద్వీపే. ఇక్కడ చేసిన కర్మానుష్ఠానం, ఇక్కడ చేసే యజ్ఞయాగాది క్రతువులు, ఇక్కడ చేసే ‘ధర్మాచరణాల వల్ల ప్రపంచంలో ఉన్న మనుష్యజాతి అంతా ఉద్ధరించబడుతూ ఉంటుంది. అంత గొప్ప అధికారం ఇవ్వబడిన ప్రాంతం భూమండలంలో ఇదొక్కటే.’