ప్రపంచ ఇతిహాసాలన్నిటిలోనూ కొన్ని సమాన లక్షణాలుంటాయన్న స్ఫురణతో ఆసియాఖండంలో అతిముఖ్యమైన పారశీకుల షహనామా భారతీయుల మహాభారతాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తూ భారతీయుల దార్శనికస్థితిని ఈ రచన వెలుగులోకి తెచ్చింది. పర్షియన్ భాష మాట్లాడేవారికి షహనామా జాతియేతిహాసం. భారతీయులకు మహాభారతం మహేతిహాసం. పారశీక సంస్కృతికి షహనామా ప్రతిబింబమైతే భారతీయ తత్త్వాన్ని ప్రపంచానికి చాటింది మహాభారతం. షహనామా అంటే రాజుల వంశచరిత్ర. మహాభారతం చంద్రవంశరాజుల చరిత్ర. రెండూ అపురూపమైన రత్నాల గనులు.