‘చలపతి హిమాలయ శిఖరాలవలె ఉన్నతుడు. తిరుమలగిరి వలె పూజనీయుడు. మామూలు మానవుల అంచనాలకు అందని మహనీయుడు’ అనుకున్నది శైలజ చాలా ఆలస్యంగా…. చలపతి ఆమెను రెండు పాములనుంచి కాపాడాడు. ఒకటి అసలు పాము… మరొకటి మనిషిరూపంలో ఉన్న కొండచిలువ. చాలా స్వతంత్రమైన అభిప్రాయాలతో, నిండైన వ్యక్తిత్వంతో, ధైర్యశాలిగా పెరిగిన శైలజ వ్యక్తులను అంచనావేయడంలో తప్పులు చేయదు. స్త్రీ పెంపకంలో ఉంది అసలు రహస్యం. మనిషి ఉన్నతుడు కావలెనన్నా, అధముడు కావలెనన్నా స్త్రీ చేతిలోనే వుంది. శిలలను మామూలు బండరాళ్ళగానే ఉంచే తల్లులు కొందరైతే, బండరాళ్లను రమణీయ శిల్పాలుగా మలిచే వజ్రమ్మవంటి స్త్రీలు కొందరు. ఆధునిక స్త్రీ జీవితంలో వస్తున్న మార్పులను, స్త్రీ పెరుగుతున్న తీరును వివరిస్తూ స్త్రీ జీవితానికి దర్పణం పట్టిన అందమైన రచన..