'బ్రతకడం కోసం తర్వాత యిది నా రెండో నవల. అది క్రీ.శ. ఇరవయ్యో శతాబ్దాన్ని గురించి ఇది క్రీ. పూ. అయిదో శతాబ్దానికి సంబంధించినది. నేను మానవ సమాజారంభ దశనుండి నేటివరకు జరిగిన వికాసాన్ని గూర్చి ఇరవై కథలు (ఓల్గా నుంచి గంగవరకు)గా వ్రాయాలనుకొన్నాను. వాటిలో ఒకటి బౌద్ధ యుగానికి సంబంధించినది. వ్రాయటానికి పూనుకున్నప్పుడు అన్ని విషయాలను కథలో యిముడ్చుట కానిపనిగా తోచింది. అందువల్లనే ' సింహ సేనాపతి' నవలా రూపంలో మీ ముందుకు వస్తోంది.