మన జ్యోతి శాస్త్రాది గ్రంథములు, మత సంబంధ ఆచార వ్యవహారాదుల నియమబద్ధము చేయునట్టి హైందవ మత గ్రంథములు, పరమ సత్యములైన వెన్ని రుజువుచేయు నిమిత్తము; సర్వులు నైతిక శాస్త్రమగు జ్యోతిశాస్త్రరీత్యా పూజా శాంత్యాదివ్రతాచార వ్యవహారముల తిరిగి పునరావృతము చేసుకొని దైవబల గ్రహబలములను పెంపొందించుకొనవలయునన్న సదుద్దేశ్యముతో ఈ పుస్తకరచన చేసితిని.