కథకులు రెండు రకాలుగా ఉంటారు. నిర్దిష్ట ప్రాంతంలోని మాండలికాల్ని, జీవితాల్ని, కష్టసుఖాల్ని, ఆచార వ్యవహారాల్ని యథాతథంగా అద్భుతమైన శైలిలో కథల్ని రాసేవారు ఒక రకమైతే, అలాంటి కథలని రాస్తూ జీవితాలు అలాగే ఎందుకున్నాయో, ఎలా ఉంటే బాగుంటుందో చెప్పే వాళ్ళు మరోరకం! పై రెండు రకాల కథకుల్లో ఈ కథల రచయిత ఏ రకం వాడో కథలన్నీ చదివితే మీకే అర్థమవుతుంది.