PublisherN K Publications AuthorV Venkatrao ISBNVPHTO0154 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages162
Description
పేరుకు ఇవి విజయనగరానికి సంబంధించిన కధలే అయినా, గ్రామదేవతలు వున్నా ఏ ఉరికైనా ఈ కథలు వర్తిస్తాయి. గ్రామదేవతలు లేని గ్రామాలు దాదాపుగా వుండవు. గ్రామాల్లో ఏమిటి? చిన్న చిన్న పట్టణాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఉన్నారు. మాది విజయ "నగరమే", అయినా, మా పైడితల్లమ్మను "గ్రామ" దేవతనే అంటారు. కాకపోతే మొక్కుకునే, మొక్కుల పేర్లలో తేడాలుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభలంటారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలంటారు. మా ఊరిలో ఘటాలు అంటారు. పేర్లు ఏమైనా సారాంశం ఒకటే. "తమ కోరికలు తీర్చమని" సామజిక సమస్యల పరిష్కారాన్ని సమాజంలో వెతుక్కోకుండా, మొక్కులతో తేరిపోతాయనే నమ్మే ప్రజలు వున్న ఏ ప్రాంతానికైనా ఈ కథలు వర్తిస్తాయి.
ఈ కథలన్నీ పేద, మధ్యతరగతికి జీవితాలకు సంబంధించినవే . వాళ్ళ ఆశలు, అనుభూతులు, ఆలోచనలు, అనుభవాలు, అనుబంధాలు, ఆనందాలు, అప్పులు, అమాయకత్వాలు, ఆక్రోశాలు, ఆధారపడటాలు, ఆర్ధిక సమస్యలు ఎన్నో...ఎన్నో... వుంటాయి.