మనుషులందరినీ సమంగా ప్రేమించగలగడం ఒక సిద్ది అంటారు. తటస్థపడ్డ పుస్తకాలన్నిటిని అలాగే ఇష్టపడడం కూడా ఒక సిద్ధే. అది ఏ పుస్తకం కానివ్వండి. మీరు శ్రద్ధగా చదువుతున్నారు, ఇష్టంగా పరిచయం చేస్తున్నారు. మీకు పరిచయ కళ బాగా తెలిసింది. పుస్తకంలో ప్రధానమైన విషయాలన్నిటిని సారం ఎక్కడుందో పట్టుకుని సరళంగా ఏ రకమైన సందిగ్దతలు లేకుండా చెప్పుకుంటూ పోయే శక్తి అందరికి అబ్బదు.