కొందరు తాము భోగం అనుభవిస్తారు. ఆ భోగం వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. రాక్షసప్రవృత్తి అంటే అదే. శరీరానికి బలం ఉన్నప్పుడు ఈశ్వరుడిని చేరుకునే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. శరీరంలో బలముండగా అది కేవలం భోగానికి మాత్రమే వాడుకున్నవాడు ఆపదను గమనించలేడు. కాలం వెళ్ళిపోతున్నదని తెలుసుకోలేడు. తాను భోగలాలసుడు కావడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగాన్ని అనుభవించకూడదనే దృష్టికోణం కూడా పొందినవాడినే రాక్షసుడని పిలుస్తారు.