శంకర భగవత్పాదులు పరమ కారుణ్యులు. వారు గొప్ప జ్ఞాని. సాక్షాత్తు శివావతారులు. అటువంటి వారికి ఎంత కరుణ చూడండి. మీరు కనకధారా స్తోత్రమే ఉదాహరణ తీసుకోండి. శంకరాచార్యులవారు కనకధారాస్తోత్రం తనకు ఒక గుప్పెడు అన్నం పెట్టమని చేశారా? చెయ్యలేదు. మనందరికీ అన్నం పెట్టమని అన్నపూర్ణాష్టకం చేసి ఆయనేం కోరుకున్నారు అమ్మా ‘జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాందేహిచపార్వతీ’ అన్నారు. అమ్మా జ్ఞానవైరాగ్యాలను కటాక్షించు అన్నారు. ఎన్నో స్తోత్రాలనిచ్చారు. అటువంటి శంకరులు ఒక బ్రాహ్మణ గృహిణికి ఉపకారం చెయ్యాలని కనకధారాస్తోత్రం చేశారు.