PublisherGollapudi Veeraswamy Sons AuthorAdibhatla Pattabhi Ramaiah ISBNGOLLAPUDI0053 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages298
Description
పరమేశ్వరుని దివ్య నామ సహస్రానికి వ్యాఖ్యానము వ్రాయాలనే సంకల్పము కలిగింది. ఈ సంకల్పమునకు ప్రేరణ కలిగించినవారు శ్రీ యుతులు గొల్లపూడి వెంకన్నబాబుగారు. ఇతః పూర్వం వెంకన్న బాబుగారి ప్రేరణతో శ్రీ లలితా సహస్ర నామాలకు, శ్రీ లక్ష్మి సహస్ర నామాలకు వ్యాఖ్యానాలు వ్రాసాను. అవి రెండు అయన సౌజన్యంతో ముద్రణ భాగ్యాన్ని పొందాయి. తరువాత శ్రీ శివ సహస్రనామాలకు కూడా వ్యాఖ్యానము వ్రాయమని వారు నన్ను కోరడం జరిగింది. ఈ విధంగా నాచేత భగవత్సేవ చేయిస్తున్న వారికీ నా కృతజ్ఞతలు.
నాకు తెలిసినంత వరకు శివ సహస్రనామములకు ప్రామాణికమైన వ్యాఖ్యను మహాపురుషు లెవరును రచింపలేదు. శంకర భగవత్పాదులు కూడా పెక్కు శివ సూత్రములను రచించిన గొప్ప శివ భక్తులైనను శివ సహస్ర నామములు వ్యాఖ్యానమును రచింపలేదు. గొప్ప శివ భక్తులైన లీలాశుకులవారు కూడా దీనికి వ్యాఖ్యానమును రచింపలేదు. ఎందరో మహాపండితులు పరమశివునికి ఏకాంత భక్తులు కలరు.