సృష్టించే కళే సృజనాత్మకత. అస్తిత్వంలో అది ఒక గొప్ప తిరుగుబాటు వ్యవహారం. ఏదైనా సృష్టించాలంటే ముందు మీరు అన్ని నిబద్దీకరణల నుంచి బయటపడాలి. లేకపోతే, మీరు సృష్టించేది దేనినో అనుకరిస్తూ నకలును సృష్టించడమే అవుతుంది. ఎవరైతే తమ అంతర్ద్రుష్టితో ఇతరులెవరూ ఇంతకుముందెప్పుడూ చూడని వాటిని దర్శించి, వినని వాటిని వినగలరో, అలాంటి వారికి 'సృష్టించే కళ' ఉంటుంది. అందుకు మనసు, పూర్వనిశ్చితాభిప్రాయాలు, తెలివితేటల నుంచి పూర్తీ స్వేచ్చ అవసరం.