ఇది శాస్త్రగ్రంథం. దీన్ని నవలలా చదువుతూ పేజీలు తిప్పేస్తూపోతే ఏదీ తలకెక్కదు. బుర్రలో మిగలదు. శాస్త్ర గ్రంథములలో చెప్పిన యోగములను నాకు తెలిసిన ఉదాహరణ జాతకములతో సమన్వయము చేశాను. ఒక వ్యాసము చదవడం పూర్తయ్యాక ఆ యోగాలు మీకు తెలిసిన ఉదాహరణ జాతకములలో సమన్వయము అవుతున్నాయో లేదో పరిశీలంచండి. అప్పుడు నా విశ్లేషణ సరిగ్గా ఉందో, లేదో తెలుస్తుంది.