నేటి మన సమాజంలో స్వాములుగానూ, బాబులుగానూ చలామణి అవుతూ పూజలందుకుంటున్న అనేకమంది దగుల్బాజీల కోవలోని వాడే ఈ స్వామికూడా! స్వామి క్రూరత్వానికి ఒక అబల గురైంది. భర్తని పోగొట్టుకుంది. స్వామి స్వరూపాన్ని గ్రహించింది. స్వామిని కటకటాల వెనక్కి పంపిస్తానని ప్రతిన బూనింది. ఆ అబల ఆవేదననీ, ఆరాటాన్నీ, పోరాటాన్నీ, ఉద్యమాన్నీ ఉత్తేజపూరితం గానూ, స్వాముల బతుకుల్నీ, బండారాల్నీ, దుష్టత్వాల్నీ, కపటత్వాల్నీ, దుర్మర్గాల్నీ, మోసాల్నీ, ధనకాంక్షల్నీ ఆసక్తికరంగానూ, ఉత్కంఠ భారితంగానూ ఆక్షరీకరించిన నవల 'స్వాములోరు'.