వెఱ్ఱి మొఱ్ఱి వైద్య చిట్కాలని ఈసడించకండి. పరిశోధన చేయండి. చేయించండి! చాలా తంత్రాలను చూసేను. చూడవలసినవి చాలా ఉన్నాయి. వైద్యం కోసం గాలించా. ఇంకా తంత్ర గ్రంథాలు దొరికితే వాటిని అనువదించి లోకానికి అందించాలని ఆకాంక్ష. మరొక్క విషయం. ఇందు చెప్పిన కొన్ని ఓషధులపేర్లు తెలుగు నిఘంటువులలో లేవు. ఆ పైన ఒక ఓషధికి రెండు మూడు అర్థాలున్నాయి. అనుభవం కల వైద్యులే ఏది సరియైనదో నిర్ణయించడానికి సమర్థులు. ప్రతి ఓషధిని రంగుల బొమ్మతో ప్రకటించి అది ఎందుకు ఉపయోగిస్తుందో చెప్పే బాధ్యత ప్రభుత్వ సంస్థలకుంది. ఇట్లా సమగ్రమైన ఆయుర్వేద నిఘంటువునకై నిరీక్షిద్దాం.