పరిహార క్రియలలో తంత్రక్రియ అత్యంత శక్తివంతమైనది. ప్రభావంతమైనదిగా మనం గ్రహించాలి. తంత్రంలో దైవార్చన, వృక్షార్చనా, మూలికాధారణ, పుప్షo, పత్రం వంటి అనేక ద్రవ్యాలను వినియోగించి చేసే అనేక తంత్రములు మహర్షులు మనకు అందించారు. వాటి మర్మాలు విధి విధానాలు కాలక్రమంలో మరుగున పడిపోవటం చేత వీటిని పరిహార క్రియగా వినియోగించే వారు తగ్గిపోయారు.సాంప్రదాయ బద్ధంగా మనం గ్రహ, దైవానుగ్రహానికి, కామ్యసిద్ధికి, రోగ, ఋణ, శత్రు కుటుంబ కలహాలు, ధనధాన్యవృద్ధి, సంతానప్రాప్తి, భూ, గృహ, వాహన ప్రాప్తికి ఆరోగ్యం, తేజస్సు వృత్తి, ఉపాధి, వ్యాపారం రాజకీయం, విదేశీప్రయాణం, ఉన్నత పదవి ఇలా ఏ అంశానికైనా పాటించే పరిహార క్రియలకంటే అత్యంత సులభంగా పాటించగలిగే పరిహార క్రియాక్రమమే ఈ తంత్ర పరిహార శాస్త్రం.