పదవ తరగతి పాస్ అవాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా పరీక్ష/లైసెన్స్ ఉంటుంది గానీ, పేరెంట్ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. 'పిల్లలు న్యాచురల్ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్ చదివి పెంచారు?' అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, 'ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ' నుంచి టీన్స్ ని, వ్యక్తిత్వంతో పెంచటానికి కావలసిన గైడ్ - లైన్స్ పై సంపూర్ణమైన పుస్తకం.