మంచి ఆహారం పిల్లల శరీర ఎదుగుదలకు తోడ్పడినట్లే, మంచి సాహిత్యం వారి మానసిక ఎదుగుదలకు ఉపకరిస్తుంది. పిల్లల మనస్సుల్లో ఉన్నత భావాలను పెంచే బాలసాహిత్యం అవసరమని నమ్మి బాలల విజ్ఞాన, వినోద, వికాసాలే లక్ష్యంగా చక్కటి చిక్కటి బాల సాహిత్యాన్ని సృష్టిస్తున్న బాలల కథా రచయిత నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారి కలం నుండి జాలువారిన ఆణిముత్యాల కథా సమాహారమే 'తెలివైనవాడు' కథా సంపుటి. పిల్లలను అబ్బుర పరుస్తూ పెద్దలను బాల్యంలోకి జార్చి ఆనందపరిచే ఇతివృత్తం, శైలితో వ్రాసిన అద్భుతమైన కథా సమాహారంలోని కథలు చదివి ఆనందపు అనుభూతులు సొంతం చేసుకుంటారు కదూ!