PublisherVanguri foundation of America AuthorYadavalli ISBNVPHTO0135 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages92
Description
శృంగార రసం తరువాత హాస్యరసమే ప్రధానమైనది అని పండితులు ఏనాటి నుంచో చెప్తూ వచ్చినా నాకెందుకో అది సరి కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రక్రియ తీసుకున్నా శృంగారం సులభం. హాస్యం కష్ట సాధ్యం. శృంగారం వ్రాసిన కవులు, కథకులు కోకొల్లలుగా ఉంటె హాస్యం వ్రాసిన వారు అతి తక్కువ సంఖ్యలోనే ఉంటారు. అలాగే సినిమాలే తీసుకుంటే మనకి శృంగారం సునాయాసంగా అభినయించి హీరోలు అయిపోయిన వాళ్ళతో పోల్చి చుస్తే హాస్యాన్ని అభినయించి పండించిన వాళ్ళు తక్కువే. ఆలా తెలుగు సినిమాలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు హాస్యాన్ని పండించి మనం మనసులకి హత్తుకుపోయిన నటీనటులు, ఆయా హాస్య సంఘటనులు, సరదా పాటలు, సంభాషణలు,.......... ఒకటేమిటి తెలుగు చలనచిత్రాలలో హాస్యం గురించి ఇంత సమగ్రమైన పుస్తకం నేను ఇప్పటి దాక చూడలేదు.