శ్రీ కె. సుదర్శనంగారు వృత్తిపరంగా ఉన్నతస్థాయి ఇంజనీరు, ప్రవృత్తి భాషాధ్యయనం.వారు సంస్కృత, ఆధునికార్య, ద్రావిడ, యూరోపియన్ భాషలలోను, భాషాశాస్త్రంలోనునిష్ణాతులు. ఆంగ్లపదజాలం, దాని ఉచ్చారణ తెలియజెప్పడం ఈ రచన ఉద్దేశం. విషయం తెలుగు పద్యంలో చెప్పి తరువాత దానిని ఆంగ్లంలో వివరించటం ఇందు అవలంబించిన పద్ధతి. ఛందస్సుమీద పట్టు ఉండటంతో పద్య రచన సుగమమయింది. సంబంధ లేక సరూప పదాలు ఒకచోట కూర్చడంవలన పాఠకునికి సౌకర్యం.