ఇందులోని సత్యాసత్యములు ప్రయోగపూర్వకముగా పరిశోధన చేసిన తరువాత ప్రాచీనకాలపు తారాబలము, చంద్రబలములో నిజము లేదని గమనించి పరాశర పధ్ధతి ప్రకారం తారాబల చంద్రబలమును రచించుచున్నాను. ఇందుకు పరాశర పద్ధతియే ప్రామాణికము దీనిని ఉపయోగించుకోన్నచో దైవజ్ఞులు ప్రజలకు ఎంతో మేలు చేయగలరు. ఒక పని కోసం ఎన్నిసార్లు తిరగకుండా తారాబలము చూచుకొని ఏరోజు పని జరుగునో ఆరోజు మాత్రమే వెళ్ళుట వలన అనవసర ప్రయాస ధన వ్యయము తగ్గును. మరియు ప్రయాణములలో ప్రమాదములు, పెళ్ళిళ్ళలో ప్రమాదములు, పుణ్యక్షేత్రములకు వెళ్ళినపుడు ప్రమాదములు తప్పి పోవును.